Posted on 2025-07-25 07:30:42
పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం తో విచారణ
చోరీఘటన వివరాలు తెలపడానికి నిరాకరిస్తున్న అపార్ట్మెంట్ వాసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్ లో ఉన్న పృధ్వి రెసిడెన్సి అపార్ట్మెంట్లో వారం రోజుల క్రితం జరిగిన చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి క్లూస్ టీమ్ ను రప్పించి విచారణ చేపడుతున్నారు. అయితే అపార్ట్మెంట్లోని 114 ఫ్లాట్ లో అద్దెకు నివాసముండే ఓ ప్రభుత్వ ఉద్యోగురాలు వీకెండ్ కావడంతో శనివారం సాయంత్రం హైదరాబాద్లో నివాసముండే తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ చోరీ ఘటనలో సుమారు నగదు రూపాయలతో పాటు బంగారు ఆభరణాలు కూడా సుమారు రెండు లక్షల వరకు చోరీ అయినట్లు బాధితురాలు తెలిపారు. అయితే నిజామాబాద్ లోని ప్రతిష్టమైన భద్రతగా పేరండిన ఈ అపార్ట్మెంట్లో చోరీ జరగడం వెనక ఓరి జరిగిన విషయం తెలపడానికి అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ చూసే వారు ఏమి జరిగిందో ఎలా జరిగిందో చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు. పైగా ఇలాంటి చోరీలు సహజమని కొట్టిపారేస్తున్నారు. అసలు ఇంత భద్రత గల అపార్ట్మెంట్ అని పేరుగల ఈ అపార్ట్మెంట్లో గత 20 రోజుల నుండి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వాస్తవం తెలిసింది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయాన్ని పసిగట్టిన దుండగులు ఈ ఘాటుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది.
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >
చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...
Posted On 2026-07-23 08:40:10
Readmore >
చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య
Posted On 2026-07-23 08:08:04
Readmore >