Posted on 2025-07-23 12:35:19
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వాంతులు, విరోచనాలతో ఇద్దరు మృతి చెందారు. ఈఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ లో చోటు చేసుకుంది. కలుషిత నీరు కారణమై ఉంటుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన కొనింటి చిన్న భూమయ్య (60), మెట్టు స్వామి (32) తీవ్ర విరేచనాలతో మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత మూడు రోజులుగా గ్రామంలో పదుల సంఖ్యలో మంది విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నారని, పలువురి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >
వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-07-22 15:05:39
Readmore >
రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-07-22 15:03:11
Readmore >
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >