| Daily భారత్
Logo




విద్య రంగ సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 23న బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

News

Posted on 2025-07-20 15:01:06

Share: Share


విద్య రంగ సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 23న బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని ధర్నా చౌక్ నుండి గాంధీ చౌక్ మీదుగా ధర్నా చౌక్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్,బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీచర్స్, లెక్చరర్స్, ఎంఈఓ, డిఇఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అమలు చేయాలన్నారు. గురుకులాలకు, ఎస్ఎంఎస్ హాస్టల్లకి సొంత భవనాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సందర్భంగా ఈ నెల 23న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూనియర్ ప్రభుత్వ కళాశాల బందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్, ఏఐఎస్టీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు అనుముల సతీష్, ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్,నగర అధ్యక్షులు అజాద్, అబి, గణేష్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అశుర్ జిల్లా నాయకులు వినోద్, సృజన్,మనోజ్, గబ్బర్ సింగ్, రమేష్, ఏఐపీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, నాయకులు గణేష్ సింగ్, యశ్వంత్, సూర్య పాల్, ఏఐఎస్టీఎస్ నీరజ్,మధు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >