| Daily భారత్
Logo




యధా రాజా తథా ప్రజాగా జిల్లాలో గురుకుల హాస్టళ్లు

News

Posted on 2025-07-19 09:38:36

Share: Share


యధా రాజా తథా ప్రజాగా  జిల్లాలో గురుకుల హాస్టళ్లు

జిల్లా కలెక్టర్ నుండి సంబంధిత అధికారుల వరకు తనిఖీలు చేపట్టిన మారని పరిస్థితి

ఆర్మూర్ లో అత్యంత విషాదం.. విద్యార్థి ఆత్మహత్య.

కలకలం రేపుతున్న ఘటన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివే సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్మూర్ పట్టణ శివారులోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో రెండో సంవత్సరం (బైపీసీ) చదువుతున్న విద్యార్థి గడ్డం సంతోష్ (16) కళాశాల గ్రౌండ్ లో ఉన్న చెట్టుకు శనివారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురుకుల హాస్టల్ అధికారులకు పదేపదే ఆదేశాలు ఇస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో స్వయంగా కలెక్టర్ సైతం గురుకులాల్లో తనిఖీలు చేపడుతున్న గురుకుల పాఠశాలను నడిపే అధికారులల్లో  మాత్రం ఎలాంటి చలనం రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాప్పటికీ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అరెపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంతోష్ వేల్పూర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో స్థల సేకరణ సమస్యతో ఈ కళాశాలను ఆర్మూర్ లోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలోనే కొనసాగిస్తున్నారు. ఈ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సంతోష్ ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు.

సంతోష్ ఉదయం ఆరున్నర వరకు కళాశాల గ్రౌండ్ లోనే వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సెజ్ లను పూర్తిచేశాడు. గ్రౌండ్ నుంచి ఫ్రెషప్ కావడానికి తిరిగి తమ గదిలోకి వెళ్లిన సంతోష్ టవల్ తీసుకొని వెనుక వైపు ఉన్న కాంపౌండ్ వాల్ దూకి బయటకు వెళ్లినట్లు సమాచారం. కాలేజీకి 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోనే ఉన్న ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గమనించి సమాచారం ఇవ్వడంతో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న సంతోష్ వారం రోజుల క్రితమే కళాశాలకు వచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం వచ్చిన సంతోష్ తన తోటి మిత్రుల్లో ఒకరిద్దరికి తనకి ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. సంతోష్ కు ఫస్ట్ ఇయర్ బైపీసీలో మూడు బ్యాక్లాగ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. తమ గ్రూపులో 13 మంది విద్యార్థులు ఉండగా అందరితో కలివిడిగానే ఉంటాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >