| Daily భారత్
Logo




బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది : మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రామ్మర్తి గోపి

News

Posted on 2025-07-19 09:20:16

Share: Share


బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది : మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రామ్మర్తి గోపి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక లేనిపోని అసత్యపు ఆరోపణలు చేస్తూ జిల్లా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రామ్మర్తి గోపి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు పాలించిన కెసిఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై అనేక అక్రమ కేసులు, ఆ పార్టీ నేతలు కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ విషయం మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. వీటన్నింటినీ చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన విమర్శించారు. తమపై తమ పార్టీ కార్యకర్తలపై బిఆర్ఎఫ్ నేతలు కార్యకర్తలు దాడులకు దిగితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ జనరల్ సెక్రటరీ వేణు రాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విక్కీ యాదవ్, వినోద్ కుమార్, శోభన్, అవిన్, రమేష్, నరేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >