Posted on 2025-07-19 14:38:33
క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో వాట్సప్ కి APK లింక్ షేర్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర సైబర్ నిందుతుడు అరెస్ట్.
RAPIDO కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుండి మొబైల్ ఫోన్స్,సిమ్ కార్డ్స్ సేకరణ,మోసాల అంతరం తిరిగి కొరియర్ ద్వారా పంపడం.
నిందుతులకు గుర్తుతేలియని వ్యక్తుల నుండి రాపిడో ద్వారా ప్రతి లక్ష రూపాయలకు 2500 రూపాయల కమిషన్.
దేశవ్యాప్తంగా NCRP పోర్టల్ నందు 60 ఫిర్యాదులు , సుమారు 50 లక్షల రూపాయల మోసాలు..
ఒక కారు,06 మొబైల్ ఫోన్స్ స్వాధీనం.
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.,
సైబర్ నిందుతున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సైబర్ టీమ్,సిరిసిల్ల పట్టణ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: హైదరాబాద్ లోని చింతల్,వెంకటరామిరెడ్డి నగర్ కు చెందిన మొహమ్మద్ కలీం పాషా, తండ్రి: బాబుజానీ అనునతడు తనకు పరిచయం ఉన్న హైదరాబాద్ కు చెందిన రషీద్ ఇద్దరు కూడా చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి ఎలాగయినా తక్కువ సమయములో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యముతో ఆన్లైన్ ద్వారా ప్రజలను సులువుగా మోసగించి డబ్బులు సంపాదించ వచ్చునే నిర్ణయించుకుని,రషీద్ కి పరిచయం ఉన్న అంకిత్ అనే వ్యక్తి వద్దకు 2025 సంవత్సరములోని ఫిబ్రవరి నెలలో ఇద్దరు కలసి కలకత్తాకు వెళ్లి ఆన్లైన్ ద్వారా ప్రజలను ఎలా మోసాగించాలో అడుగగా అంకిత్ వారికి RBL క్రెడిట్ కార్డు కొరకు దరకాస్తు చేసుకొని కార్డు వచ్చిన తరువాత activation కొరకు చూస్తుంటారో వారి యొక్క పేర్లు, ఫోన్ నంబర్స్, క్రెడిట్ కార్డు నంబర్స్ మరియు పాన్ కార్డ్ నెంబర్ లను అంకిత్ వారిద్దరికీ whatsapp ద్వారా పంపిస్తానని,వాటితో క్రెడిట్ కార్డు కొరకు దరకాస్తు చేసుకొన్న వారితో క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ లాగా వీరిద్దరూ మాట్లాడి వారిని నమ్మించి మోసాలకు పాల్పడే వారు అందులో భాగంగా క్రెడిట్ కార్డ్ activation కొరకు బాధితులతో మాట్లాడి వారికి అంకిత్ పంపిన Apk/links ను పంపితే అట్టి Apk/links ను క్లిక్ చేసినా లేదా ఇన్స్టాల్ చేసుకున్నా వారి ఫోన్ hack అయ్యిన తదుపరి క్షనాలలో అంకిత్ వారి క్రెడిట్ కార్డులలో ఉన్న డబ్బులను e-కామర్స్ ద్వారా కొనుగోళ్ళు జరిపి డబ్బులన్నీ కాజేసేవాడు.
అంకిత్ చెపినట్లు మహమ్మద్ కలిమ్, రసిద్ చేసినందుకు ప్రతి లక్ష రూపాయలకు 2,500/- చొప్పున RAPIDO కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వీరిద్దరికీ డబ్బులు పంపించేవారు.
అంకిత్ కేవలం వీరితో whatsapp ద్వారా మాత్రమె మాట్లాడుతూ క్రెడిట్ కార్డు దారుల వివరాలను పంపుతూ, వీరిద్దరూ ఉపయోగించడానికి RAPIDO కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా Mobile phones మరియు SIM కార్డులను ప్రతి 10 రోజులకు ఒకసారి పంపుతూ, పాత Mobile phones మరియు SIM కార్డులను తిరిగి RAPIDO కొరియర్ ద్వారా వెనక్కి తీసుకునే వాడు.
ఈక్రమంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి వీరి చేతిలో మోసపోగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా సిరిసిల్ల పట్టణ పోలీసులు జిల్లా సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, గంగరెడ్డి, కిట్టు, మహేష్ ఆధ్వర్యంలో టీమ్ ఏర్పటు చేసి సాంకేతికత ఆధారంగా ఈ రోజు హైదరాబాద్ లో పట్టుకోవడం జరిగిందని మిగితా ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
అరెస్టు చేయబడిన నిందితుడి వివరములు:
1.Mohammad Kaleem Pasha s/o Mohammad Babu Jani, 32 years, Muslim, occ: Private job, r/o H.No 26-99, Venkatramireddy Nagar, Near Community hall, Chintal, Hyderabad,
పరారిలో ఉన్న నిందితుని వివరములు:
1.Ankith r/o Kolkata of West Bengal state,
2.రషీద్ r/o Hyderabad.
అంతర్ రాష్ట్ర సైబర్ నిందుతున్ని పట్టుకోవడంలో కృషి చేసిన సైబర్ ఆర్.ఎస్.ఐ జునైద్, సైబర్ టీమ్ గంగరెడ్డి,కిట్టు, మహేష్,శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ లను ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >