Posted on 2025-07-17 17:10:12
యథేచ్ఛగాకాంగ్రెస్ అరాచక పాలన
-కాంగ్రెస్ నాయకుల?,బజారు రౌడీలా?
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి రేవంత్ సర్కారు దాష్టీకాలకు నిదర్శనం
కేసీఆర్ కనుసైగ చేస్తే ఒక్క కాంగ్రెస్ నేత తిరగలేడు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
వేల్పూర్ లో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పథకం ప్రకారం చేసిన దాడి రేవంత్ సర్కారు దాష్టీకాలకు నిదర్శనం అని ఆయన గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, విపక్ష నేతలు చేసే విమర్శలకు ప్రజాస్వామ్య బద్దంగా సమాధానం చెప్పలే కానీ ఇండ్లపై దాడులు చేసి హింసకు పాల్పడటం ఏమిటని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే నేరమా అని ఆయన నిలదీశారు. గల్ఫ్ కార్మికుల విషయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ,రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, ఎన్ ఆర్ ఐ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల టోల్ ఫ్రీ నెంబర్ లాంటి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయని విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేయడం ఎలా తప్పవుతుందన్నారు.ఈ మాత్రం దానికే దాడులకు పాల్పడటం సిగ్గు చేటు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎవరి ఇంటి మీదనైనా దాడులు చేసేమా, మీలాగా మేము హింసకు పాల్పడి ఉంటే అసలు కాంగ్రెస్ మిగిలేదా అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇలాంటి దాడులు సభ్యత కాదని, రాజకీయాల్లో ఇది మంచిది కాదని ఆయన హితవుపలికారు.
యథేచ్ఛగాకాంగ్రెస్ అరాచక పాలన సాగుతోందని ఆయన పేర్కొంటాయి
కాంగ్రెస్ నాయకులా?,బజారు రౌడీలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ కనుసైగ చేస్తే ఒక్క కాంగ్రెస్ నేత తిరగలేడని,కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకుంటామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >