Posted on 2025-07-16 09:28:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ చాన్స్ లర్ జిష్ణు దేవ్ వర్మకు ఘన స్వాగతం లభించింది. బుధవారం డిచ్ పల్లి ఏడో బెటాలియన్ లో కమాండెంట్ సత్యనారాయణ, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెటాలియన్ ఆవరణలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొక్కలను నాటారు. అంతకుముందు ఏడో బెటాలియన్ పోలీసులు పోలీసు బ్యాండ్ ద్వారా గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు. డిచ్ పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డిలు స్వాగతం పలికారు. తెయూ రెండో స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ కు విద్యార్థుల ద్వారా స్వాగతం లభించింది. గవర్నర్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >