| Daily భారత్
Logo




కళ్ళు కూడా తెరవని పసికందును రోడ్డుపై పడి వేసిన కసాయి తల్లి

News

Posted on 2025-07-15 19:38:55

Share: Share


కళ్ళు కూడా తెరవని పసికందును రోడ్డుపై పడి వేసిన కసాయి తల్లి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అక్రమ సంతానమో.. లేక కూతురు పుట్టిందని సాకలేకనో.. ఓ తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. కళ్లు కూడా తెరువని పసికందును రోడ్డుపై పడేసింది. ఇంకా వెలుగును కూడా చూడని ఆ బిడ్డ బతుకును చీకట్లో కలిపేసింది. తన బతుకులోని చీకటి తొలగించుకునేందుకు, ఆ పసిబిడ్డ జీవితాన్ని అంధకారం చేసింది.

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని ఆడ బిడ్డను ఓ తల్లి రోడ్డుపై పడేసి, చక్కగా చీకట్లో జారుకుంది. ఈ ఘటన మంగళవారం రాత్రి నగరంలోని నాలుగో ఠాణా పరిధిలో జరిగింది. చిన్నారిని రోడ్డుపై వదిలేయడంతో ఆ పసికందు లేత చర్మంపై గాయాలయ్యాయి.

నగరంలోని పద్మానగర్ 100 ఫీట్ల రోడ్డుకు వెళ్లేదారిలో ఓ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ చిన్నారిని అక్కడే రోడ్డుపై వదిలేసి, ఆ తల్లి పారిపోయింది. స్థానికులు గమనించి దగ్గరకు తీసుకున్నారు. తల్లి ఎదపై వెచ్చగా సేద తీరాల్సిన ఆ శిశువు చీకట్లో గుక్కపట్టి ఏడవడాన్ని చూసి చలించిపోయారు. పాపకు పాలు పట్టి జో కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో చిన్నారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, పెళ్లి కాని యువతి గర్భం దాల్చి, ఇలా పసికందును కని వదిలేసినట్లు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి తెలిపారు. చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >