| Daily భారత్
Logo




బాడ్సి సబ్ స్టేషన్ లో విద్యుత్ లైన్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

News

Posted on 2025-07-15 16:38:40

Share: Share


బాడ్సి  సబ్ స్టేషన్ లో విద్యుత్ లైన్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

ఠాణాకుర్డు లో ఈత వన మాహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే  భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్  నియోజవర్గంలోని మోపాల్ మండలం బాడ్సి   గ్రామంలో  నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ  విద్యుత్ లైన్లను సబ్ స్టేషన్ లో  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి  భూపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం  ఏర్పడిన 18 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, అందులోనే భాగంగా 33/11 కె.వి విద్యుత్   డిచ్పల్లి నుండి బాడ్సి గ్రామానికి కరెంటు లైన్ ను వేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరమని, పంటలకు ఎలాంటి నష్టం లేకుండా విద్యుత్ సరఫరా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా  ఎన్ పి డి సి ఎల్  సిఎండి వరుణ్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక లైను వేయడానికి 28 లక్షలు ఖర్చు అయిందని తెలిపారు.  120 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టమని ధర్పల్లి సబ్ డివిజన్ కోసం ప్రతిపాదనలు పంపించామని, డివిజన్ ఏర్పాటు చేసుకొని, వివిధ 12   గ్రామాలకు సబ్ స్టేషన్లు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం  మల్లు బట్టి విక్రమార్కను కోరినామని అన్నారు. విద్యుత్ శాఖ కు సంబంధించిన ఉద్యోగులు  గతంలో కంటే ఈసారి బాగానే పనిచేశారని  ఎమ్మెల్యే అభినందించారు.

 మోపాల్ మండలంలోని ఠాణాకుర్డు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఏర్పాటుచేసిన ఈత వన మహోత్సవంలో  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా  వనమాహోత్సవంను ఉద్దేశించి మాట్లాడుతూ  ప్రపంచం పర్యావరణ సమస్య ఎదుర్కొంటుందని, భూతాపం పెరిగి వాతావరణంలో సమస్యల లోపిస్తుందని, ఇటువంటి సమస్య రాకుండా ప్రతి కుటుంబం 6 మొక్కలు నాటాలని, సంరక్షించి భావితరాలకు అందించాలని ఆయన అన్నారు. గ్రామంలో ఇల్లు లేని పేదలకు, అర్హత ఉన్నవారికి  తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని  హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి కట్టిబడి ఉన్నానని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు.


ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ముప్పగంగారెడ్డి,పిసిసి డెలికేట్  శేఖర్ గౌడ్, ఎన్ డి సి సి బి వైస్ చైర్మన్ నల్ల శేఖర్ రెడ్డి, ఎన్పీడీసీఎల్  ఎస్ ఈ రాపల్లి రవీందర్ రమేష్ రెడ్డి,ఏ డి ఈ బాలేష్ కుమార్, ఎక్సైజ్ ఈ ఎస్ మల్లారెడ్డి, సిఐ సుస్మిత,ఎస్సై మల్లేష్, మండల అధ్యక్షులు ఎల్లోల సాయ రెడ్డి, గిరిజన కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూర్య రెడ్డి, గంగ ప్రసాద్, అరికెల రాజారెడ్డి, జలంధర్ రెడ్డి,లింగన్న  ప్రవీణ్ అధికారులు నాయకులు,  కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >