| Daily భారత్
Logo




మైనర్ బాలికకు గర్భస్రావం కావడానికి (అబార్షన్) మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు

News

Posted on 2025-07-15 15:02:29

Share: Share


మైనర్ బాలికకు గర్భస్రావం కావడానికి (అబార్షన్) మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

మెడికల్ షాప్ నిర్వాహకులకు వేములవాడ ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి హెచ్చరిక

డైలీ భారత్, వేములవాడ: మైనర్ బాలికకు గర్భస్రావం(అబార్షన్) అయ్యేలా మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వేములవాడ ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలికను సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు ప్రేమ,  పెళ్లి పేరుతో అట్టి మైనర్ బాలికను శారీరకంగా వాడుకొగా  అట్టి బాలిక గర్భం దాల్చగా అట్టి గర్భం పోవడానికి  సిరిసిల్ల పట్టణానికి చెందిన గీతాంజలి మెడికల్ షాప్ యజమాని  నల్లా శంకర్ ను ఆశ్రయించి ఒక మైనర్ బాలికకు గర్భం పోవడానికి మందులు ఇవ్వమనగా అట్టి గీతాంజలి షాప్ ఓనర్ చట్ట వ్యతిరేకంగా ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా గర్భం పోవడానికి మందులు ఇవ్వగా అట్టి మందులను వేసుకున్న మైనర్ బాలికకు గర్భ స్రావం అయినది. ఈ విషయంపై కేసు నమోదు చేసి గతంలో అట్టి యువకుడిని మే 30న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. మరియు చట్ట వ్యతిరేకంగా మైనర్ బాలికకు గర్భం పోవడానికి మందులు ఇచ్చిన గీతాంజలి మెడికల్ షాప్ ఓనర్ నల్ల శంకర్ ను 12- 07- 2025 రోజున రిమాండ్ కు తరలించనైనది. 

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు

ఈ సందర్భంగా ఏ.ఎస్పీ మాట్లాడుతూ డాక్టర్ పిస్క్రిప్షన్ లేకుండా మరియు చట్టానికి వ్యతిరేకంగా మెడికల్ షాప్ నిర్వాహకులు ఎవరైనా మందులు విక్రయిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందులు విక్రయిస్తున్న తరుణంలో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో  చెలగాటమాడే వారినీ ఉపేక్షించేది లేదని తెలిపారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >