| Daily భారత్
Logo




అసంబద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను సవరించాలి : TPTF రాజన్న సిరిసిల్ల

News

Posted on 2025-07-15 14:56:31

Share: Share


అసంబద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను సవరించాలి : TPTF రాజన్న సిరిసిల్ల

TPTF  రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య డిమాండ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అసంబద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదనివ్ అన్నారు..ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము బడిబాట తర్వాత పాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా work adjustment చేయాల్సి ఉన్నా కూడా ప్రస్తుత సంఖ్యను పరిగణలోకి తీసుకోకుండా పూర్వపు విద్యా సంవత్సరం యొక్క UDISE సంఖ్య ఆధారంగా అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది అని అన్నారు.

నిబంధనల ప్రకారం కాంప్లెక్స్ యూనిట్గా మొదట ఆ తర్వాత మండల యూనిట్ గా మరియు ఆ తర్వాతనే జిల్లా యూనిట్ గా తీసుకోవాల్సి ఉండగా ఒక మండలంకు సంబంధించిన ఉపాధ్యాయులను దూరం మండలంకు ఇవ్వడం జరిగింది. work adjustment అని కాకుండా SHUFILING చేయడం జరిగింది.

అధికంగా ఉన్న టీచర్లను అవసరమున్న పాఠశాలలకు కేటాయించాల్సి ఉండగా అవసరమున్న చోట కూడా టీచర్లను తరలించి అక్కడికి వేరే టీచర్లని ఇవ్వడం జరిగింది.

1. ఎం.పి.పి.ఎస్. బావుసాయిపేట, మండలం కొనరావుపేట నుండి ఒక ఉపాధ్యాయురాలిని ఎం.పి.పి.ఎస్. వెంకపేట, సిరిసిల్లా మండాలనికి కేటాయించి ఎంపిపిఎస్ వెంకపేట నుండి ఒక ఉపాధ్యాయుడిని పి.ఎస్. మానాల, రుద్రంగి మండలానికి డిప్యూటేషన్ ఇచ్చారు.

2. ఎం.పి.పి.ఎస్. హరిజన వాడ నుండి ఎంపిపిఎస్ అనంతగిరి, ఇల్లంతకుంట మండలానికి కేటాయించి తిరిగి ఎం.పి.పి.ఎస్. అనంతగిరి నుండి మరొక ఉపాధ్యాయుడిని ఎం.పి.పి.ఎస్. రుద్రంగి, రుద్రంగి మండలానికి డిప్యూటేషన్ చేశారు.

3. ఎం.పి.యు.పి.ఎస్. ఒగులాపూర్, ఇల్లంతకుంట మండలం నుండి ఎం.పి.పి.ఎస్. జవహార్పేట, మండలం ఇల్లంతకుంటకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించారు. తిరిగి ఇదే పాఠశాల ఎం.పి.పి.ఎస్. జవహార్పేట నుండి వెరొక ఉపాధ్యాయుడిని ఎం.పి.పి.ఎస్. రేపాక, ఇల్లంతకుంట మండలానికి డిప్యూటేషన్ చేశారు.

ఈ విధంగా ట్రైయాంగిల్ పద్ధతిలో జిల్లాలో డిప్యూటేషన్ల ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినారు. పాఠశాలల అవసరాల మేరకు కాకుండా ఉపాధ్యాయుల అవసరాల మేరకే డిప్యూటేషన్లు చేసినట్లుగా కనబడుతున్నది.

కావున రాజన్న సిరిసిల్లాలో జరిగిన అసంబద్ధమైన మరియు నిబంధనలకు విరుద్ధమైన వర్క్ అడ్జెస్ట్మెంట్ ఉత్తర్వులను నిలుపుదల చేసి కౌన్సిలింగ్ పద్ధతిలో సర్దుబాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >