| Daily భారత్
Logo




భార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

News

Posted on 2025-07-15 14:49:07

Share: Share


భార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భార్యను వేధించిన కేసులో భర్త కంది రమేష్ కి సిరిసిల్ల రెండవ అదనపు మెజిస్ట్రేట్ గడ్డం మేఘన మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువడించినట్లు తంగళ్ళపల్లి ఎస్ ఐ ఉపేంద్ర చారి తెలిపారు.

వివరాల ప్రకారం

తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన  కంది పద్మ కి బద్దనపల్లి గ్రామానికి చెందిన కంది రమేష్ తో 2001 సంవత్సరంలో వివాహం జరిగింది.వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కలదు రమేష్ మద్యంకు బానిస అయ్యి పద్మను, పిల్లలను నిత్యం వేధించేవాడు.ఈక్రమంలో 2017 జూలై 4న రమేష్  మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యను డబ్బులు ఇవ్వాలంటూ వేధించాడు దానికి ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను తీవ్రంగా కొట్టగా అడ్డువచ్చిన పద్మ తల్లిని కూడా కొట్టాడు.పద్మ ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి రమేష్ ని రిమాండ్ చేసిన అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెద్ది విక్రాంత్ వాదనలు వినిపించాగా కోర్టు కానిస్టేబుల్ శ్రీకాంత్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా,సాక్ష్యదారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ మేఘన నిందితుడు రమేష్ కి మూడు సంవత్సరాలు  శిక్ష విధించినట్లు ఎస్.ఐ తెలిపారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >