| Daily భారత్
Logo




తే.యూ లో జరిగే రెండవ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

News

Posted on 2025-07-15 16:40:02

Share: Share


తే.యూ లో జరిగే రెండవ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

వైస్ చాన్సలర్ టి.యాదగిరి రావు వెల్లడి

భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన సిపి సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ విశ్వవిద్యాలయంలో  బుధవారం జరిగే 2వ స్నాతకోత్సవ ఏర్పాట్లును యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి. యాదగిరి రావు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. స్నాతకోత్సవం కోసం ఏర్పాట్లు పూర్తి అయినట్లు విసి తెలిపారు. భద్రత ఏర్పాట్లను కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. స్నాతకోత్సవం జరిగే ప్రాంగణంలో స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం, బాంబు డిస్పోజల్ టీం అధికారులు నిశితంగా పరిశీలించారు. ఏర్పాట్లలో భాగంగా డిచ్ పల్లి 7వ బెటాలియన్ గాడ్ ఆఫ్ హోనర్ బృందం, బ్యాండ్ టీం, ఆర్ ఎస్ ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్.టి యాదగిరిరావు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య లకు గౌరవ వందనం సమర్పించినారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎం. యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్, డీన్స్ తో కలిపి మాక్ సెషన్ నిర్వహించారు. ఈరోజు జరిగిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో రిసెప్షన్ కమిటీ, డయాస్ కమిటీ, సీటింగ్ ఏర్పాటు కమిటీ, సెనేట్ కమిటీ, ప్రింటింగ్ కమిటీ, హాస్పిటాలిటి కమిటీ, ఎంట్రీ & రెగ్యులేషన్ కమిటీ, ప్రెస్ మీడియా కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, డిస్ట్రిబ్యూషన్ కమిటీ, డిసిప్లిన్ కమిటీ, గోల్డ్ మెడల్స్ నిర్వహణ కమిటీ, క్యాంపస్ రిజర్వేషన్ కమిటీ కన్వీనర్లు ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ అపర్ల, ప్రొఫెసర్ హారతి, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ కి రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ నాగరాజు, డా.ఏ పున్నయ్య లతో పాటు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >