Posted on 2025-07-15 07:26:45
డైలీ భారత్, గండికోట: జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలో పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రొద్దుటూరులోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవిగా గుర్తించారు. సోమవారం స్నేహితులతో గండికోటకు వెళుతున్నానంటూ ఇంట్లో చెప్పి వెళ్లింది విద్యార్థిని. రాత్రి గడిచినప్పటికి విద్యార్థిని ఇంటిక రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైష్ణవి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మంగళవారం ఉదయం గండికోటలోని ముళ్లపొదల్లో ఓ అమ్మాయి నగ్నంగా శవమై పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు
పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా వైష్ణవిదిగా గుర్తించారు. ఆపై విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దారుణంగా హత్యకు గురైన కన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఎర్రగుంట్ల మండలం హనుమాన్ దుర్తి గ్రామానికి చెందిన వాసి. విద్యార్థిని ఐదు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడితో ప్రేమవ్యవహారం ఉన్నట్లు సమాచారం. యువకుడు లోకేష్‌తో నిన్న బైక్‌పై వైష్ణవి గండికోటకు వెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. జమ్మలమడుగు పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >