Posted on 2025-07-15 09:43:59
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నెహ్రూనగర్ నందు గల పవర్ లూమ్ కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ కౌన్సిలింగ్, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినారు.
ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ హాజరై కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ కార్మికులతో మద్యపాన వ్యసనం గురించి, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి మాటాడిన అనంతరం మద్యం మానేయాలనుకున్న కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది.
డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...
మద్యపాన వ్యసనం ఒక సైకోసోమాటిక్ డిసార్డర్ వ్యాధి అని తెలిపారు. ఇది మెదడు, నరాల వ్యవస్థ మీద చూపే ప్రభావం వల్ల వ్యక్తి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడని తెలిపారు.
దురలవాట్లు, మానసిక సమస్యలు, వ్యాధులు నుండి బయటపడేందుకు ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో తనను సంప్రదించాలని కోరారు.
సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ అతిగా మద్యపాన వ్యసనానికి లోనైన వ్యక్తిలో పారానాయిడిజం అనే అనుమాన ప్రవృత్తి పెరుగుతుందని తెలిపారు. తద్వారా బార్య శీలాన్నీ శంకించడం, భార్యపై అనుమాన ప్రవృత్తి పెరగడం వల్ల కుటుంబ సంబంధాలు విచ్చిన్నమౌతాయని అన్నారు.
వ్యసనాల నుండి త్వరగా బయట పడేందుకు మందులు, కౌన్సిలింగ్ ప్రతి వార్డులో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
తంబాకు నమలడం, బీడీ,సిగరెట్ త్రాగడం మొదలగు వ్యసనాలు మానుకునేందుకు మైండ్ కేర్ సెంటర్ ను సంప్రదించాలని పున్నంచందర్ తెలిపారు.
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలుపుతూ త్రిఫ్ట్ పథకం, నేతన్న భీమ, మహిళాశక్తి చీరల ఉత్పత్తి పథకం, యార్న్ సబ్సిడీ లాంటి వాటిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె. పున్నంచందర్, వస్త్రోత్పత్తి దారుడు బూట్లు సుదర్శన్, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి మరియు కార్మికులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >