| Daily భారత్
Logo




ఖగోళయాత్రికుడు శుభాంశు శుక్లాకు విద్యార్థుల వినూత్న శుభ స్వాగతం

News

Posted on 2025-07-14 15:24:57

Share: Share


ఖగోళయాత్రికుడు శుభాంశు శుక్లాకు విద్యార్థుల వినూత్న  శుభ స్వాగతం

డైలీ భారత్, దమ్మన్నపేట:భారతదేశం నుంచి అంతరిక్షానికి వెళ్లిన రెండవ ఖగోళయాత్రికుడు శుభాంశు శుక్లా భూమికి తిరిగివచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని, ZPHS దమ్మన్నపేట పాఠశాల విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అంతరిక్ష రంగవల్లిలతో పాఠశాల మైదాన్నాన్ని అలంకరించడంతో పాటు , కాగితంతో తయారు చేసిన గ్లోబ్‌లు రూపొందించి ప్రదర్శిస్తూ, దేశభక్తి గీతం "సారే జహాఁ సె అచ్చా" ను  ఆలపించారు. అంతేకాకుండా, శుభాంశు శుక్లా ప్రయాణ విశేషాలను చూపించే విపులమైన పోస్టర్ రూపొందించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ మాట్లాడుతూ,

"శుభాంశు శుక్లా సుమారు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన భూమి చుట్టూ సుమారు 96 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. అంతరిక్ష నావ "ఇన్‌ఎస్‌ఎస్‌" (INS)లో ఉన్నప్పుడే అనేక శోధనలు చేపట్టారు. యూరీ గగారిన్, రాకేష్ శర్మ తరువాత అంతరిక్షానికి వెళ్లిన రెండవ భారతీయుడు శుక్లా" అని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానం, దేశభక్తి, మరియు శాస్త్రీయ ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెరిగినట్టు ఉపాధ్యాయులు తెలియజేశారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >