Posted on 2025-07-13 13:30:03
డైలీ భారత్, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఫైజ్ నగర్ కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి మహమ్మద్ తాజుద్దీన్ (22)గా గుర్తించారు. పట్టణ పరిధిలో అల్లా నా రోడ్డులో గల రహమత్ నగర్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభించింది. శనివారం మధ్యాహ్నం నమాజ్ కోసం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరిన యువకుడు రాత్రి వరకు రాలేదు. జామ మసీదు వద్ద అతని బైక్ ను రికవరీ చేశారు. ఆదివారం ఓ పాడు పడ్డ బావిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం మీద పెద్ద పెద్ద గాయాలు ఉన్నందున కసితీరా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హతుడు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >