| Daily భారత్
Logo




అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి : డిఎస్పి నాగేంద్ర చారి

News

Posted on 2023-12-17 06:26:52

Share: Share


అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి : డిఎస్పి నాగేంద్ర చారి

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

డైలీ భారత్, వేములవాడ: జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఆదేశాల మేరకు వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సనుగుల(గుగ్గిరెద్దుల) కాలనిలో  ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ సందర్భంగా  డిఎస్పీ నాగేంద్ర చారి  మట్లాడుతు... 

ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమo నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని, సరైన  నంబర్ ప్లేట్స్ లేని 15 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని సబంధించిన వాహన దారులకు సరైన పాత్రలు చూపించి వాహనాలు తీసుకవేళ్ళవచ్చు అన్నారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు.

గ్రామాల్లో ఎవరైనా  అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు  ఫోన్  చేసినాచో  వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.

గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో,నేరాల నియంత్రణ లో  సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

మొబైల్ ఫోన్ పోయిన చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ నందు పిర్యాదు చేయండి.పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుంది.

ఈ యొక్క కార్యక్రమాo తరుచుగా నిర్వహిస్తామని,చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయిన గాంజా, గుడుంబా రవాణా మరియు విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ కిరణ్ కుమార్, ఎస్.ఐ లు అశోక్, రాజేష్ లు , ఆర్.ఎస్.ఐ లు డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >