| Daily భారత్
Logo




నవోదయ లో 3 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులను అభినందించిన ఎంఈఓ ఝంకిలాల్

News

Posted on 2025-07-12 10:00:13

Share: Share


నవోదయ లో 3 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులను అభినందించిన ఎంఈఓ ఝంకిలాల్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పాపకొల్లు రోడ్డులో గల సాయి ఎక్స్ లెంట్ స్కూల్ విద్యార్థులు నవోదయలో 3సీట్లు సాధించినందుకు శనివారం జూలూరుపాడు మండల విద్యాధికారి జుంకీలాల్ ప్రవేశ పరీక్ష లో విజయం సాధించిన విద్యార్థులను  తన కార్యాలయంలో అభినందించారు . నవోదయలో అర్హత సాధించిన వారిలో  1).భరత్ కార్తికేయ* తండ్రి నరసింహారావు ,2)నండ్రు విశ్వ సన్నిధ్* తండ్రి. గురుమూర్తి, 3) కొలిపోక యశ్వంత్,తండ్రి సురేష్ లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసుకువచ్చి నవోదయ ప్రవేశ పరీక్షలో విజయం పొందేందుకు సాయి ఎక్స్ లెంట్ ఉపాధ్యాయుల ప్రతిభ ఎంతో గొప్పదని ఆయన అభినందించారు .భవిష్యత్తులో కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం నిర్వహించే పోటీ పరీక్ష లో మరిన్ని విద్యాలయాల్లో సీట్లు సాధించేందుకు సాయి ఎక్స్ లెంట్ ఉపాధ్యాయులు,విద్యార్థులకు  మరింత సాధన అందించి ఉత్తమ విద్యార్థులను మరింత మందిని తయారు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా విద్యార్థులతో విజయం సాధిస్తూ సాయి ఎక్స్ లెంట్ స్కూల్ ను జిల్లా స్థాయిలో రాణిస్తున్నందుకు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు మండల ప్రజలకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా సాయి ఎక్స్ల్లెంట్ స్కూల్ కు పిల్లలను పంపిన తల్లిదండ్రుల నమ్మకాన్ని మరియు శ్రమతో పిల్లలకు అందుబాటులో ఉండి చదువు పట్ల శ్రద్ధ చూపించి వారి విలువైన సమయాన్ని విద్యార్థులకు కేటాయిస్తూ తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఎంత విజయాన్ని సాధించామని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హుస్సేన్ నాగరాజు బండ్ల మధుసూదన్ రావు. కొలిపాక వెంకటేశ్వర్లు బండ్లనరసింహారావు కొలిపాకసురేష్ హలవత్ నరసింహారావు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >