| Daily భారత్
Logo




నిర్లక్ష్య డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు

News

Posted on 2025-07-10 13:23:59

Share: Share


నిర్లక్ష్య డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు

ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ డే రోజున పసికందు మృతి.

డాక్టర్ నిర్లక్ష్యం వహించారంటూ బంధువుల ఆరోపణ 

ప్రైవేట్ హాస్పటల్ పై చూపించే శ్రద్ధ పేషంట్లపై చూపిస్తే బాగుండేది  

నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్ చేయమని ప్రాధేయపడిన పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది

డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్

పాల్వంచ పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు.. వెంటనే ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు

ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీలో ఉంటూనే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు చేస్తున్న డాక్టర్

డైలీ భారత్, పాల్వంచ: పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ ఒకటో తారీకు పసికందు డాక్టర్ నిర్లక్ష్యానికి మృతిచెందడంతో జీర్ణించుకోలేని తల్లిదండ్రులు బంధువులు  ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి పసికంది మృతికి కారకురాలైన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐ డి ఓ సి పాల్వంచ లో సబ్ కలెక్టర్ వేణుగోపాల్ కు వినతిపత్రం అందించిన మృతి చెందిన పసికందు తండ్రి. పూర్తి వివరాల్లోకి వెళితే పాల్వంచ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ నిండు గర్భిణీ మనోవేదన  పలువురిని శ్లోక సముద్రంలో ముంచింది. లక్ష్మీదేవి పల్లి మండలం తోక భాంధల గ్రామానికి చెందిన కరుణ (23) ప్రసవం కోసం వచ్చిన గర్భిణీని పలు విధాలుగా ఇబ్బందికి గురి చేస్తూ  నొప్పులు వస్తున్నాయని తట్టుకోలేక ఆపరేషన్ చేయమని రెండు చేతులు జోడించి ప్రాధేయపడిన కనికరించని డాక్టర్  ఆసుపత్రి సిబ్బంది. ఆరోగ్యంగా ఉన్న పసికందు  మరికొద్ది సేపట్లో  ప్రసవించవలసి ఉండగా నిర్జీవంగా ఆ బిడ్డను తల్లికి అప్పగించారు.

తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని మానిటరింగ్ చేస్తూ నార్మల్ డెలివరీ చేయాలని చెప్పి డాక్టర్ అనూష  ప్రభుత్వ ఆసుపత్రి నుండి బయటికి వెళ్లారని తరువాత నిండు గర్భిణీ అయిన కరుణాకు నొప్పులు రావడంతో  భరించలేక తల్లడిల్లిన స్థితిలో హడావుడి చేసి ఆపరేషన్ ధీయేటర్ కు తీసుకెళ్లి బిడ్డ చనిపోయాడు అని బంధువులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. ఆపరేషన్ కి స్ట్రక్చర్ పై తీసుకు వెళుతున్న ఆయాలు డబ్బులు డిమాండ్ చేయడం కోసమేరుపు.ఇదేమిటని బంధువులు ప్రశ్నించగా  నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించామని తప్పని పరిస్థితుల్లో  ఆపరేషన్ చేశామన్నారు. కానీ పసికందు ప్రాణాలను  కాపాడలేకపోయామని పలు కారణాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.కరుణ బంధువులు డాక్టర్ను నిలదీయగా సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరగవని ఎక్కడో ఒకటి ఇలాంటి పరిస్థితి జరుగుతుందని సినిమాలో చెప్పిన రీతిగానే నిజజీవితంలో కూడా తెలియజేసిన డాక్టర్లు  అందుకు మా బాధ్యత కాదంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారంటూ బంధువులు ఆరోపించారు.గర్భిణీ స్త్రీ ప్రసవ నొప్పులు తట్టుకోలేక  ఆపరేషన్ చేయమని ప్రాధేయపడిన డాక్టర్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, జాగ్రత్త వహించి ఉంటే బిడ్డ చనిపోయేవాడు కాదని, డాక్టర్ నిర్లక్ష్యంతో తల్లికి కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.9 నెలలు బిడ్డను మోస్తూ బిడ్డకు జన్మను ఇవ్వాలని ఎంతో ఆశతో వచ్చిన వారికి నిరాశ ఎదురయింది. నిర్జీవంగా ఉన్న శిశువును వారికి బహుమతిగా ఇచ్చారు.

ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటనలు మరల చోటు చేసుకోకుండా డబ్బు ఉన్నవారికి లేనివారికి  ఒకే విధంగా వైద్యం చేయాలని, పసికందు మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే రోజు జూన్ 1  రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన స్టేషన్ సిబ్బంది. బుధవారం నిర్జీవ శిశువును  పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. చనిపోయిన శిశువును తీసుకొని తిరుగు ప్రయాణమైన బంధువులు. భద్రాద్రి జిల్లా అంటేనే గిరిజన జిల్లా అటువంటి జిల్లాలో గిరిజనులకు అడుగడుగున అన్యాయమే జరుగుతుంది. కలెక్టర్ భార్య ఇక్కడ డెలివరీ అయింది మనల్ని కూడా మంచిగానే చూస్తారని ఆశతో ఇక్కడికి వచ్చిన వారికి చేదు అనుభవం ఎదురయింది. ఉన్నవారికి ఒక తీరుగా లేని వారికి ఒక తీరుగా ఇక్కడ చూస్తారు అని నిరూపించిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది. ఏది ఏమైనాపటికి ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా డాక్టర్ పై హాస్పిటల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న బంధువులు స్నేహితులు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే  డాక్టర్లు ఆన్ డ్యూటీ లో ఉంటూనే  వారి ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్తున్నారని డ్యూటీలో ఉండి వారి ప్రైవేట్ ఆసుపత్రి పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని. దాన్లో భాగంగానే చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తు మాకు తగిన న్యాయం చేయాలని కోరుతూ ఐ డి ఓ సి కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్  కలెక్టర్ వేణుగోపాల్ ను కలిసి పూర్తిగా వివరించి వారికి వినతిపత్రం అందజేసిన కుటుంబ సభ్యులు.

Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >