Posted on 2025-07-08 19:20:20
కేసు నమోదు చేసి నిందితురాలిని జైలుకు పంపిన పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లే అభంశుభం తెలియని ఐదునెల్ల తన కూతుర్ని కాడతేర్చిన ఘటన మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో విశాధాన్ని నింపింది. తన భర్త తన కూతుర్ని పట్టించుకోవడం లేదని, మందలించిడన్న కోపంతో తాగిన మైకంలో కన్నకూతురు అని చూడకుండా ఐదునెల్ల పసికందును ఆ కసాయి తల్లి చిదిమివేసింది. భీమ్ గల్ సీ.ఐ సత్యనారయణ గౌడ్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోనుగొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్ తన భార్య సిరసు రమ్య తాగుడికి అలవాటై తన ఐదునెలల కూతురు శివానిని పట్టించుకోవడం లేదని ఈ నెల 7 న మందలించి రోజువారి పనుల్లో భాగంగా బయటకు వెళ్ళాడు. తన కూతురు శివాని కారణంగా తన భర్త మందలించడని క్షణికావేశంలో చిన్నారి శివానిపై దుప్పటి కప్పి అధిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపివేసింది. నిందితురాలి భర్త నా కూతుర్ని నా భార్యే చంపేసిందని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నిందితురాలు పారిపోతుండగా భీమ్ గల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పట్టుకున్నారు. దీంతో నిందితురాలిని విచారించగా తానే చంపినట్లు నేరం అంగీకరించింది.
దీంతో పోలీసులు నిందితురాలు రమ్యను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. అనంతరం ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా నిందుతురాలిని జైల్ కు పంపినట్లు సీ. ఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >