Posted on 2025-07-07 12:30:05
ప్రజావాణిలో వీల్ చైర్ పై వచ్చి తమ సమస్యను పరిష్కరించాలంటూ వికలాంగ వృద్ధ మహిళ వినతి
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన మేడగం వెంకటలక్ష్మి అను ఓ వృద్ధ వికలాంగ మహిళ తమపై అరాచకాలు గురిచేస్తున్న తన పెద్ద కుమారుడు రెండు ఏళ్ల నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగిందని అప్పటినుండి తన పెద్ద కుమారుని కుమారులు వరుసకు సొంత మనుమళ్లు రమేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి లు తన పేరుపై ఉన్న పట్టా భూమి ఐదు ఎకరాలతో పాటు ఉమ్మడి ఇల్లును కూడా అక్రమంగా వారిని వారి పేరు మీద మార్చుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బ్యాంక్ ఎకౌంట్, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్కులు కూడా తమ వద్ద నుండి బలవంతంగా లాక్కొని తమ పేరు మీద వ్రాయించుకున్నారని ఇదేంటి అని అడిగితే ఎక్కువగా మాట్లాడవద్దు అతిగా ప్రవర్తిస్తే పెట్రోలు పోసి తగిలేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని వృద్ధురాలు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనతో పాటు వచ్చిన తన కూతురు మనమరాళ్లు కు మీడియా వివరణ అడిగితే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారని తెలిపారు. తమ ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆర్డిఓ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వృద్ధురాలు పేరుమీద ఉన్న భూమిని ఆమెకే చెందే విధంగా చూడాలని ఆదేశించడం జరిగిందని వారు తెలిపారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >