Posted on 2025-07-03 13:07:18
బంజారుల మధ్య చిచ్చుపెట్టే కుట్ర మానుకుంటే మంచిది
లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల నేతలకు తగిన బుద్ధి చెప్తాం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అన్నదమ్ముల్లా కలిసి ఉన్న బంజారాలను విడిదీసేందుకు రాజ్యంగ బద్ధంగా ఎన్నుకున్న ఆలిండియా బంజారా సేవా సంఘం కమిటీలను కాదని సీల్డ్ కవర్ నియామకాలు చేస్తు చిచ్చుపెడుతున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీరు మార్చుకోవాలని సంఘం అధ్యక్షులు చంద్రునాయక్ హెచ్చరించారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆలిండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు చంద్రునాయక్ మాట్లాడుతు.. బంజారాల (లంబాడా) ల హక్కుల కోసం పనిచేస్తు, రాజకీయంగా ఉన్నత పదవులు అనుభవించిన రాములు నాయక్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం కొత్తగా కమిటీలను నియమాకం చేయరాదని అన్నారు. నిజామాబాద్ జిల్లా కమిటీని జిల్లాలోని అన్ని మండలాల కార్యవర్గాలతో కలిసి రాజ్యంగ బద్ధంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆలిండియా బంజారా సేవా సంఘం జాతీయ కమిటీతో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు అసలు సంబంధం లేదన్నారు. త్వరలో జాతీయ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం త్ రెడ్డిల దగ్గర మంచిపేరు ఉండగానే పోదని అన్నారు. తెలంగాణలో అత్యధికంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆలిండియా బంజారా సేవా సంఘం జాతీయ కమిటీతో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు అసలు సంబంధం లేదన్నారు. త్వరలో జాతీయ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిల దగ్గర మంచిపేరు ఉండగానే సరిపోదని అన్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బంజారాల కమ్యూనిటీకి మంత్రి పదవి కావాలని ధర్నాకు పిలుపినిస్తే అందరం కలిసి పోరాడుదాం అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం వ్యవసాయ కమీషన్ సభ్యులుగా రాములు నాయక్ ಬಂಜಾರಾಲ అభ్యున్నతికి పాటుపడితే హర్షిస్తామన్నారు. పోడు భూముల సాధనకు జరిగే ఉద్యమంలో కలిసి వస్తే స్వాగతిస్తామని అంతేగాని బంజారాల మధ్య బేదాభిప్రాయాలకు తావు ఇస్తే మాత్రం ఉరుకునేది లేదని చంద్రునాయక్ హెచ్చరించారు.
#nizamabad
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >