డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:మాతృమూర్తిని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ కుటుంబాన్ని శుక్రవారం కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణతో కలిసి పరామర్శించారు. కన్నీటి పర్యంతమవుతున్న సత్యనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నెహ్రూ, శోభన్, రాందాస్, బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ నాయకులు ఖాజా భక్ష్, ఎస్సీ సెల్ రామిళ్ళ మధు, ఎస్టీ సెల్ పూర్ణచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
News
లావుడ్యా పాత్లి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి