| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అన్నార్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి రాచబండ్లకోయగూడెం వ్యవసాయ పొలంలో నెమలిచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య

అన్నార్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి రాచబండ్లకోయగూడెం వ్యవసాయ పొలంలో నెమలిచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారు పాడు గ్రామానికి చెందిన, భానోతు భద్రం, తండ్రి పేరు: భద్య, 28 సంవత్సరములు, గత పది సంవత్సరముల క్రితం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో పెళ్లి జరిగింది. వీరికి మూడు సంవత్సరముల విక్షిత్ అనే బాబు సంతానముగా కలడు. గత ఆరు నెలల క్రితం ప్రియాంక అనారోగ్య కారణాలతో మరణించింది. ఆ తర్వాత మృతుడు భద్రం, ఒంటరితనాన్ని భరించలేక మరియు తన కుమారుడు బాగోగులుచూసుకునేందుకుగాను, బేతాళ పాడు గ్రామానికి చెందిన పద్మ అనే మహిళను రెండో వివాహంచేసుకున్నాడు. అయితే తన కుమారుడు వీక్షిత్ ను తన మొదటి భార్య తరపు కుటుంబ సభ్యులు మరియు రెండవ భార్య మంచిగా చూసుకోవడం లేదని, తన కుమారుడి భవిష్యత్తు గురించి ఆలోచించి, తీవ్ర మనోవేదనకు గురై, మనస్థాపం చెంది, ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో రాచ బండ్లకోయగూడెం గ్రామ శివారున గల వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి,అచటనున్న నెమలి కొయ్య చెట్టుకు తాడుతో ఉరివేసుకొనిమరణించినాడు.తన కుమారుడు భద్రం, అతని కొడుకు అయిన విక్షిత్ భవిష్యత్తు గురించి, తీవ్ర ఆందోళనకు గురై, అతడిని ఎవరు చూసుకోవడం లేదని మనస్థాపం చెంది, ఉరివేసుకొనిమరణించినాడని,తన కుమారుడి మరణం పై తనకు ఎలాంటి అనుమానం లేదని మృతుడి తండ్రి బానోతు బద్య తండ్రి పేరు సామ్య ఫిర్యాదు ఇవ్వగా జూలురుపాడు ఏ.ఎస్.ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు.

Previous గుండెపుడి రెవెన్యూ 117లో అక్రమాలపై విచారణ జరపాలి
Next లావుడ్యా పాత్లి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
ADVERTISEMENT