| Daily భారత్
Logo




అప్పుల బాధతో కౌలు రైతు మృతి

News

Posted on 2025-06-26 16:10:13

Share: Share


అప్పుల బాధతో కౌలు రైతు మృతి

డైలీ భారత్, ములుగు: అప్పుల బాధతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన రాష్ట్ర మంత్రి సీతక్క సొంత గ్రామమైన ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని సోదరుడు శంకర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జెట్టి సమ్మయ్య(42) కౌలు రైతుగా జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య సుమలతతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. గత సంవత్సరం గ్రామంలో నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని రెండు ఎకరాలలో మిర్చి, మరో రెండు ఎకరాల్లో పత్తి పంట పండించాడని అన్నారు.కూలీల ఖర్చు పోను సమ్మయ్య లాభం అర్జించకపోగా అప్పుల పాలయ్యాడు. సమ్మయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకు రెండేళ్ల క్రితం పెండ్లి చేశాడు.

కుమార్తె వివాహంలో సైతం అప్పు చేశాడు. కాగా, ప్రస్తుతం మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని దుక్కులు దున్ని వాన పడితే గింజలు నాటుదామని ఎదురు చూస్తున్న సమ్మయ్యకు విత్తనాల తీసుకు చ్చేందుకు తిరిగి అప్పు కావాల్సి ఉండగా అప్పు పుట్టలేదు. దీంతో పాటు గతంలో పంట పెట్టుబడికి, కుమార్తె పెండ్లీ చేసిన అప్పులు తలకు మించిన భారం కావడంతో తీవ్ర మనస్థాపం చెందిన సమ్మయ్య ఈ నెల 5వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ దావాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఎంజీఎంకు రెఫర్‌ చేశారు.

హనుమకొండలో రెండు ప్రైవేటు దవాఖానల్లో చేర్పించి చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో ఇటీవల ఎంజీఎంకు సమ్మయ్యను తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిసింది. చేసిన అప్పులు తీరక, పంట సాగుబడిని నమ్మికొని వ్యవసాయం చేసిన కౌలు రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతుని భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు. నిరుపేద రైతును ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు మంత్రి సీతక్క చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు

Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >