Posted on 2025-06-05 18:32:05
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో హత్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారికి మెమోరాండం అందించడం జరిగింది, ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందువులు పరమ పవిత్రంగా ఆరాధించే, సకల దేవత నిలియంగా భావించే గోమాతలను అక్రమంగా వధించకుండా దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం యదేచ్చగా గోవుల అక్రమ రవాణా మరియు గోవుల వధ నిరంతరం జరుగుతూనే ఉన్నదనీ, ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న గో రక్షకుల పైన జిహాదీలు దాడులు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం గో హత్యలను ప్రోత్సహించే విధంగా ఉందని, ఇటువంటి చర్యలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది, ఇప్పటికైనా రాష్ట్రంలో పటిష్టంగా గోవధ నిషేధ చట్టాలను అమలు చేయాలని, గో రక్షకుల పైన దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి గంగాధరి సీత , జిల్లా సంఘటన కార్యదర్శి చిట్టెంశెట్టి లక్ష్మయ్య , జిల్లా బజరంగ్దళ్ సంయోజక్ మెరుగు చింటేశ్వర్ , బజరంగ్దళ్ జిల్లా బలోపాసనా ప్రముఖ్ అజయ్ పాసీ , జిల్లా దుర్గావాహిని సంయోజిక గంగాధరి ఇందుమతి , జిల్లా ధర్మప్రసార్ ప్రముఖ్ రాయల చందర్ రావు , పాల్వంచ ప్రఖండ అధ్యక్షులు గుగులోత్ లింబా నాయక్ , పాల్వంచ ప్రఖండ కార్యదర్శి భూక్యా మోహన్ , పాల్వంచ ప్రఖండ బజరంగ్దళ్ సంయోజక్ రామగిరి ప్రసాద్ , పాల్వంచ ప్రఖండ బజరంగ్దళ్ గోరక్షా ప్రముఖ్ నూకల సతీష్ , కొత్తగూడెం నగర బజరంగ్దళ్ సంయోజక్ కిరణ్ , అశ్వారావుపేట ప్రఖండ కార్యదర్శి జంగాల రాము, అశ్వారావుపేట ప్రఖండ సహ కార్యదర్శి కుమారస్వామి, ఇల్లందు, చుంచుపల్లి బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >