Posted on 2025-06-01 14:40:19
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మొయినాబాద్ l మండలం మేడిపల్లి, వీరన్నపేట్, హిమాయత్ నగర్ గ్రామంలో గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన భూమి పూజ చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ సర్టిఫికెట్ అందించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరు సొంతింటిని కలిగి ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు.అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది అన్నారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు,అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. పేదలకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాబాద్ దర్శన్,అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >