Posted on 2025-05-16 18:51:39
దేశములో ఉన్న కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు నిర్ణయం
డైలీ భారత్ న్యూస్, పఠాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు పరిశ్రమీక వాడ లో ని పాశమైలారం కిర్బీ పరిశ్రమలో యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజయ్య హాజరైన్నరు ,అనంతరం అయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె జూలై 9వ తేదీకి వాయిదా పడిందని అన్నారు. దేశంలోని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు, రైతు సంఘాలు, కూలి సంఘాలు కలిపి మే 20న సమ్మె మరియు గ్రామీణ బందుకు పిలుపునివ్వడం జరిగినది. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధాలను నిరసిస్తూ ఈ పిలునివ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల రిత్యా ఈ సమ్మెను జూలై 9వ తేదీకి మార్చాలని అన్ని సంఘాలు కలిసి ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్మించడం జరిగింది. దీనిని కార్మికులు, ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు. జూలై 9 జరిగే సమ్మె లో అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ వి ఎస్ రాజు, మల్లేశం, ఏడుకొండలు, సోమన్న, వెంకట్, శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >