Posted on 2025-05-15 14:54:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: 2025 మే 20న దేశ వ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జరుగుతున్న సార్వత్రిక సమ్మె లో కార్మికులు అదిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు.
గురువారం జూలూరుపాడు లో కార్మికుల తో కలిసి సమ్మె గోడ పత్రికల ను ఆవిష్కరించారు.అనంతరం గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఏధేచ్చగా అమలుకు పూనుకున్నదని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను నవీకరిస్తున్నామనే పేరుతో, గతంలో పోరాడి సాధించిన హక్కులను హరిస్తూ, “4 లేబర్ కోడ్స్” తీసుకురావడం జరిగిందని,వీటి అమలును నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేసారు. కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని, కనీస ఈపీఎఫ్ పెన్షన్ 9 వేలు ఇవ్వాలని, స్కీం వర్కరన్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ని రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయాలని,ఆటో మోటార్, హమాలీ వర్కర్స్ కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధరను ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదనే డిమాండ్లతో కార్మిక వర్గం ఒక రోజు సమ్మె చేసి, నిరసన తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంధం చంటి, నిమ్మటూరి గోపాలరావు, శ్రీను,నరేష్, ఇరు, రవి, తదితరులు పాల్గొన్నారు.
.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >