| Daily భారత్
Logo




ఇవాళ రేపు తెలంగాణలో వర్షాలు

News

Posted on 2025-05-14 07:41:11

Share: Share


ఇవాళ రేపు తెలంగాణలో వర్షాలు

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌ వాతావరణ శాఖ, తెలంగాణలో హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం తో పాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, తెలిపింది అయితే ఈ సాయంత్రం నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 

రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని పలు జిల్లాలకు ఆరెం జ్ అలర్ట్ జారీ చేశారు.ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం  తో  బుధవారం తెలంగా ణలోని నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహాబూబ్‌ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగా లు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, వరంగ ల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్‌, అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు 30 నుంచి 40 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవ్వాళ, రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 16వ తేదీన కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.ఇక మరోవైపు చురుక్కా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మంగళవారం మధ్యాహ్నం నాటికి దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు నికోబా ర్ దీవులను తాకినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే దక్షిణ బంగాళా ఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా ఈ రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. అయితే ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా అండమాన్, నికోబార్ దీవుల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది.

Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >