| Daily భారత్
Logo




ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

News

Posted on 2025-05-07 18:16:42

Share: Share


ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

డైలీ భారత్, హైదరాబాద్: దేశ సైన్యంతో మనమంతా అండగా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  తెలిపారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదని స్పష్టం చేశారు. అత్యవసర సర్వీస్‌లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగులు అంతా ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని చెప్పారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇవాళ(బుధవారం) ఉదయం 11 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆపరేషన్ సిందూర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీలతో పాటు అందుబాటులో ఉన్న మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల రక్షణకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలని చెప్పారు. అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలని అన్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని చెప్పారు. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలన్నారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని అన్నారు. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని హెచ్చరించారు... ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలని సూచించారు. హైదరాబాద్‌లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలని ఆదేశించారు. ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని సూచించారు. రౌడీ‌షీటర్‌లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Image 1

ప్రమాదకరమైన గుంతను మానవత్వంతో పూడ్చిన యువకులు

Posted On 2025-12-09 15:35:00

Readmore >
Image 1

మా ఇంట్లో ఓట్లు అమ్మబడువు...

Posted On 2025-12-09 15:34:00

Readmore >
Image 1

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు

Posted On 2025-12-09 12:48:45

Readmore >
Image 1

దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

Posted On 2025-12-09 11:26:29

Readmore >
Image 1

రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?

Posted On 2025-12-09 11:22:22

Readmore >
Image 1

సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు

Posted On 2025-12-09 11:21:25

Readmore >
Image 1

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు

Posted On 2025-12-09 08:11:59

Readmore >
Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >