| Daily భారత్
Logo




జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి

News

Posted on 2026-03-06 18:56:12

Share: Share


జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి

టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు 

డైలీ భారత్, కామారెడ్డి: జర్నలిస్టులపై కొందరు నాయకులు తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని టి డబ్ల్యూ జేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు అన్నారు. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టిన ముత్తగారి శిరీష్ గౌడ్, ముత్తగారి రోజా ల నిర్మాణాన్ని అధికారులు కూల్చివేయడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై తీసుకున్న ఈ చర్యను స్వాగతిస్తున్నామనీ టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు అన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి ప్రవీణ్ గౌడ్, జిల్లా కార్యదర్శి కర్ణాకర్ మరియు నేషనల్కౌన్సిల్ మెంబెర్ శీర్ల వంచ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన వార్తా కవరేజ్ కోసం విధులు నిర్వహించడానికి వెళ్లిన జర్నలిస్టులపై శిరీష్ గౌడ్ పోలీసులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగం ద్వారా తప్పుడు కేసులు నమోదు చేయించడం  ఖండిస్తున్నామన్నారు. తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నామనీ,  ఈ చర్య ద్వారా , ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం),

ఆర్టికల్ 19(1)( ఏ ) (భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ -  పత్రికా స్వేచ్ఛ), ఆర్టికల్ 19(1)( జి ) ( వృత్తి నిర్వహణ హక్కు ), ఆర్టికల్ 21 (జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ)

లు భంగం పొందాయన్నారు. జర్నలిస్టులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలనీ, 

అక్రమ కేసులు నమోదు చేసిన సంబంధిత పోలీసు అధికారులపై విచారణ చేపట్టాలనీ,  జర్నలిస్టులు భయభ్రాంతులు లేకుండా విధులు నిర్వహించేలా రక్షణ కల్పించాలన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడటం  ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఏన్ని రోజులకైనా నిజం నిజమే అవుతుంది, అబద్ధం  అబద్దమే అవుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో  టిడబ్ల్యుజేఎఫ్ సభ్యులు కాషా గౌడ్, బాలు, పిట్ల అనిల్ కుమార్,చంద్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >