Posted on 2025-05-03 08:12:24
డైలీ భారత్, హైదరాబాద్:షీ టీం నిఘా పటిష్ట భద్రత వ్యవస్థలో ఉన్న మహిళలకు రక్షణ ఏది? ఇప్పుడు హైదరాబాదు నగరం మహిళల రక్షణ విషయంలో భద్రత వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.. కామాంధు లు, పోకిరీల ఆగడాలు మితి మీరిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవు తున్నప్పటికీ మహిళలు, యువతులపై లైంగిక వేధిం పులకు పాల్పడుతూనే ఉన్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణం వెలుగు చూసింది. బరితెగించిన కామాంధులు భర్త కళ్లెదుటే భార్యను వేధించారు. అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతా యిలు బెదిరింపులకు పాల్పడ్డారు.
భర్త, మరిది, ఆడపడుచు తో కలిసి బేగంపేటలోని ఓ పబ్‌కెళ్లి ఇంటికి రాత్రి11: 30కి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్ ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భర్తపై ముగ్గురు యువకు లు దాడి చేశారు. వివాహి తను వెంబడించారు.
వారి నుంచి తప్పించుకుని డయల్ 100కి ఫోన్ చేశారు బాధితులు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు ముగ్గురు ఆకతాయి లను అరెస్టు చేశారు.
పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >