| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బైక్ వెనుక టైర్‌లో చున్నీ పడి మెడకు చుట్టేసి యువతి మృతి

బైక్ వెనుక టైర్‌లో చున్నీ పడి మెడకు చుట్టేసి యువతి మృతి

డైలీ భారత్, తూర్పుగోదావరి:తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన కళ్యాణపు రామదుర్గ (28)కు మోహన్ కృష్ణ అనే వ్యక్తితో 9 నెలల క్రితం వివాహం జరిగింది

మోహన్ కృష్ణకు ఈ మద్యే అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగం రావడంతో వారి జీవితం మారిపోయిందని ఆనంద పడ్డారు.. కానీ ఇంతలోనే అనుకోని దుర్ఘటన జరిగింది

సోమవారం రాత్రి రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటంతో భర్త హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా, బైక్ వెనుక టైర్‌లో చున్నీ పడి రామదుర్గ మెడకు చుట్టేసింది

స్థానికులు గమనించి చున్నీని కత్తిరించే సరికి రామదుర్గ కొనఊపిరితో ఉండగా.. హాస్పిటల్‌కు తరలించే లోపు మృతి చెందింది

పెళ్లైన 9 నెలలకే రామదుర్గ మరణించడంతో భర్త, తల్లిదండ్రులు రోదించిన తీరు అందరికి కంటతడి పెట్టించింది



#east Godavari

Previous సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి
Next సీసిఎస్ పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ADVERTISEMENT