Posted on 2025-04-29 18:25:42
హద్దులు దాటి జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం
లక్ష్మీదేవి పల్లి పంచాయతీలో అనేక అక్రమ నిర్మాణాలు
పట్టించుకోని సెక్రటరీ మండల అధికారులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీలో చాతకొండ వెళ్లే రహదారి పక్కన కృష్ణవేణి కాలేజీ ఎదురుగా హద్దులు దాటి అక్రమ నిర్మాణాలు అధికారుల కనుసన్నాల్లోనే వెలస్తున్నాయి.. ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు మండల అధికారులు. 1/70 గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ జీ ప్లస్ త్రీ నిర్మాణాలు చేపడుతున్న ఇవేమీ మాకు పట్టవు అన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. ఏజెన్సీ చట్టాలు లక్ష్మీదేవి పల్లి పంచాయతీకి వర్తించవు అన్న రీతిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న పంచాయతీ సిబ్బంది నోటీసులు కూడా ఇవ్వకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి ?. నిర్మాణము మొదలు పెడితేనే నోటీసులు ఇచ్చాము అని చెప్పే పంచాయతీ సిబ్బంది ఈ జి ప్లస్ త్రీ నిర్మాణానికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదంటే ఏ విధంగా అక్రమ నిర్మాణాలకు అధికారులు ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుంది. ఇదంతా ఒక ప్లాను ప్రకారమే జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పునాది వేసినప్పుడే అడ్డుపడాల్సిన పంచాయతీ సిబ్బంది జి ప్లస్ త్రీ నిర్మాణం చేసినా కూడా కల్లుండి చూడలేని రీతిగా వ్యవహరిస్తున్నారని ఎటువంటి సందేహం లేదు. కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి జి ప్లస్ త్రీ నిర్మాణం చేస్తున్న చూడకపోవడం మరి విడ్డూరంగా ఉంది. మండల అధికారులు పంచాయతీలలో పర్యవేక్షిస్తున్నారా లేరా అనే సందేహము లేకపోలేదు. అంటే ఈ జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం ఎవరికి కనిపించలేదంటారా లేక ముడుపులు ఏమైనా అందాయ అని అనుకుంటున్న ప్రజలు. ఇటువంటివి దాదాపు ఈ పంచాయతీలోనే పదుల సంఖ్యలో నిర్మాణాలు ఉన్నాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుంది వీటిని అరికట్టేది ఎవరు? నోటీసులు ఇచ్చామంటూ చేతులు దులుపుకుంటున్నారు .వాటిని ఆపే ప్రయత్నం ఏ అధికారి చేయలేకపోవడం వంటివి చూస్తుంటే పంచాయతీలో ఏ విధంగా డబ్బు చేతులు మారుతుందో అర్థమవుతుంది. ఇకనైనా జిల్లా అధికారులు కల్పించుకొని అక్రమ నిర్మాణాలను ఆపాలని కోరుతున్నా ప్రజలు . అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు తెలియవలసి ఉన్నది.జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఇట్టి అక్రమ నిర్మాణాలు నిలుపుదాల చేయవలసిందిగా కోరుతున్న ప్రజలు. ఇట్టి నిర్మాణాలకు సహకరిస్తున్న పంచాయతీ మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు..
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >