| Daily భారత్
Logo




గడువు లోపు వెళ్లకపోతే మూడేళ్లు జైలు, 3 లక్షలు జరిమానా

News

Posted on 2025-04-28 07:03:53

Share: Share


గడువు లోపు వెళ్లకపోతే మూడేళ్లు జైలు, 3 లక్షలు జరిమానా

డైలీ భారత్, న్యూఢిల్లీ: భారత్ లో ఉంటున్న పాకిస్థాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. డెడ్ లైన్ లోగా పాకిస్తాన్ పౌరులు దేశం వీడకపోతే వారిని జైలుకి పంపిస్తామని కేంద్రం వార్నిం గ్ ఇచ్చింది. అంతేకాదు 3 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామంది. 

ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం.. గడువు ముగిశాక భారత్ లో ఉన్న పాక్ పౌరులకు మూడేళ్ల జైలు లేదా 3 లక్షలు జరినిమా.. లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇక మెడికల్ వీసాల మీద ఉన్న పాకిస్తాన్ పౌరులు ఏప్రిల్ 29వ తేదీలోగా భారత దేశం విడిచి వెళ్లాలి.

పాకిస్తాన్ జాతీయులు భారతదేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం డెడ్ లైన్ కూడా విధించింది. ఈ నిబంధనల ను పాటించని వారికి అరెస్ట్, ప్రాసిక్యూషన్, మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఏప్రిల్ 22న జమ్మకశ్మీర్‌ లోని పహల్గాంలో పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది మరణించారు. వారిలో ఎక్కువగా పర్యాటకులు ఉన్నారు.ఈ ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ వెంటనే భారత ప్రభుత్వం ప్రతి చర్యలకు దిగింది. పాకిస్తాన్ పై కఠినమైన ఆంక్షలు విధించింది. 

వెంటనే భారత్ లో ఉంటున్న పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. అందుకు డెడ్ లైన్ కూడా విధించింది.ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులకు "భారతదేశం విడిచి వెళ్లండి" అంటూ నోటీసు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 

సార్క్ వీసాలు కలిగి ఉన్న వారు ఏప్రిల్ 26 లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించిం ది. మెడికల్ వీసాలు ఉన్న పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 29 లోపు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. 

ఆదివారం నాటికి దేశం విడిచి వెళ్లాల్సిన 12 కేటగిరీల వీసాలలో వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు, గ్రూప్ యాత్రికుల వీసాలు ఉన్నాయి.

ఇప్పటికే రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారిని వారి దేశానికి పంపేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వా లకు ఆదేశాలు ఇచ్చారు హోంమంత్రి అమిత్ షా.

Image 1

నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"

Posted On 2026-08-27 07:58:21

Readmore >
Image 1

గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!

Posted On 2026-08-27 05:16:28

Readmore >
Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >