| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మిస్ ఇండియా నందిని గుప్తా

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మిస్ ఇండియా నందిని గుప్తా

డైలీ భారత్, ములుగు జిల్లా: యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని రామప్ప దేవాలయా న్ని 2023 మిస్ ఇండియా విజేత నందిని గుప్తా ఆదివారం సాయంత్రం సందర్శించారు. 

ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. నందిని గుప్తా రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ నేతృత్వంలో టూరిజం గైడ్లు ఆమెకు రామప్ప ఆలయ చరిత్ర, రామప్ప లోని మదనిక సాలబం జికల చరిత్రను వివరించారు. 

అద్భుత నిర్మాణ రీతులు, అపురూప శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం జగద్విఖ్యాతం, కాకతీ యుల నిర్మాణాల్లో తల మానికం.

రాళ్లను కరిగించి పోతపోసి మలిచిన శిల్పాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. అయితే మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరనుండగా ఈ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల సుందరీమణులకు రాష్ట్రంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూపేలా ప్రభుత్వం కార్యాచరణ చేసింది. 

అందులో భాగంగా మే 14న సుందరీమణులు రామప్పకు రానున్నారు. కానీ అంతకంటే ముందుగానే రాజస్థాన్‌కు చెందిన మిస్ఇండియా రామప్పను సందర్శించారు.

Previous తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు!
Next ఈ దేశంలో వుంటూ పాకిస్తాన్ కు వత్తాసు పలికే దేశాద్రోహులను కఠినంగా శిక్షించాలి : బైండ్లకుమార్
ADVERTISEMENT