Posted on 2025-04-10 16:24:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడులు.భద్రాచలం సీఐ గన్ మెన్ రామారావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. పోలీస్ స్టేషన్లో రామారావును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ రమేష్ బృందం.
భద్రాచలం పోలీస్టేషన్ లో సీఐ గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న రామారావును ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రావెల్ తరలిస్తున్న లారీ ని మార్చి 19 న పట్టుకుని వదిలేందుకు రు. 30 వేలు డిమాండ్ చేసి, రు. 20 వేలు ఇచ్చే విధంగా మాట్లాడుకుని ఒక ప్రైవేటు వ్యక్తి ఖాతా లోకి నగదు బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. ఈ కేసు విషయంలో రామారావు తో పాటు, సీఐ రమేష్, మరో ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ డబ్బులు సీఐ కోసం తీసుకున్నాడా..? లేక ఇంకా వేరే వారికి ఇవ్వడానికి తీసుకున్నాడా..? అనే విషయం పై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >