| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

• స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్, స్టేషన్ రికార్డుల నిర్వహణపై సమీక్ష

• ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలి

• మహిళలపై జరిగే నేరాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్, స్టేషన్ రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితిగతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసులను సమీక్షించిన ఎస్పీ గారు, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదు నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామస్థాయిలో పోలీసు-ప్రజా సంబంధాలను బలోపేతం చేస్తూ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

ప్రజలకు సులభంగా, పారదర్శకంగా పోలీసు సేవలు అందేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికగా విని తగిన పరిష్కారం చూపుతూ పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని ఆదేశించారు

Previous జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్
Next ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
ADVERTISEMENT