డైలీ భారత్, సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్‌ను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
షోరూమ్ ప్రారంభం అనంతరం అతిథులు ఆధునిక గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్ విభాగాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, పట్టణ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.