| Daily భారత్
Logo




రేపే ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణోత్సవం

News

Posted on 2025-04-10 14:19:19

Share: Share


రేపే ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణోత్సవం

డైలీ భారత్, అమరావతి: ఒంటిమిట్టలో రమణీ యంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి అమ్మవార్లకు పుష్ప మాలికలు, స్వర్ణాభర ణాలతో అలంకరించారు పండితులు.. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోలాహలంగా జగదభి రామయ్య వాహన సేవ నిర్వహించారు.. 

భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.. అయితే, రేపు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం జరగనుంది.. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.. 

సీతారాముల కల్యాణో త్సవానికి సర్వం సిద్ధం చేసింది టీటీడీ.. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేశారు..

ఇక, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపకు రానున్నారు.. రేపు ఒంటిమిట్ట కోదండ రామా లయం కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం.. ప్రభుత్వం తరఫున రాములవారికి పట్టు వస్త్రా లు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.. 

రాత్రికి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు సీఎం చంద్రబాబు.. 12వ తేదీన తిరిగి కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు..

కాగా, ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ రామనవమి, హనుమత్సే వ, ఈ రోజు గరుడసేవ, రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించ నున్నారు. అనంతరం గజ వాహన సేవ నిర్వహించ నున్నారు. 

ఏప్రిల్ 12వ తేదీన రథోత్స వం నిర్వహిస్తారు. ఏప్రిల్ 14వ తేదీన ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావ రోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అలాగే, ఏప్రిల్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >