| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాంజీ గోండ్‌ అమరత్వానికి 161ఏండ్లు

రాంజీ గోండ్‌ అమరత్వానికి 161ఏండ్లు

తుడుం దెబ్బ ఆధ్వర్యంలో దమ్మపేటలో పోరాటయోధుడు రాంజీ గోండ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో పోరాటయోదులు రాంజీ గౌండ్ వర్ధంతి సందర్భంగా తుడుం దెబ్బ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగినది,నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ పోరాటయోధుడు రాంజీ గోండ్‌ నాయకత్వంలో తిరుగుబాటు ఉదృతమైందనీ, తిరుగుబాటులో కీలక ఘట్టం 1860 మార్చి ఏప్రిల్‌లో జరిగింది, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, ఊట్నూర్‌, చెన్నుర్‌, లక్షెటిపేట్‌ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్‌ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి,రాంజీ గోండు నాయకత్వంలో 1000కి పైగా గోండ్‌ ఆదివాసులు, విల్లంబులు,కోడవళ్ళు,తల్వార్‌ ధరించి సాయుధ పోరాటానికి జంగ్‌ సైరన్‌ మోగించారు, ఆదివాసీలు, రొహిల్లలు కలిసి నిర్మల్‌ సమీపంలో కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు,బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించారు,ఆ కాలంలో పోరాటం చేస్తున్న ఆదివాసీలను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు,బ్రిటిష్‌ సైన్యంతో సాగిన సాయుధ పోరులో ఆదివాసులు వీరమరణం పొందారు,రాంజీగోండుతో సహా వెయ్యి మందిని పట్టుకొని నిర్మల్‌ నడిబొడ్డున ఉన్న ఊడల 'మర్రి చెట్టుకు 1860 ఏప్రిల్‌ 9న' ఉరితీశారు, దేశంలో,తెలంగాణలో ఆదివాసీలు అస్తిత్వపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నారు,పాలకులు రిజర్వు ఫారెస్ట్‌,టైగర్‌ జోన్‌,సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌,యురేనియం నిక్షేపాలు,హరితహారం,పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఆదివాసీలను గోతిలో పాతి పెడుతున్నారు,ఏజెన్సీ అరణ్యంలో ఉన్న సహజ సంపద,ఖనిజ వనరులను బహుళజాతి కంపెనీలకు దొడ్డిదారిలో ఇష్టారాజ్యంగా,చట్టవిరుద్ధంగా దోచి పెడుతున్నారు,ఆదివాసులను నిలువుగా నిర్వాసితులను చేస్తున్నారు,ఆదివాసులకు 100శాతం ఉద్యోగాలు అవకాశాలు కల్పంచే జీఓ 3 రద్దు చేసి ఆదివాసీల కడుపు కొట్టారు,1/70, పేసా,2006లో అటవీ హక్కుల చట్టం ఇతర ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి విచ్చలవిడిగా గిరిజనేతరులు ఏజెన్సీలోకి వలసలు వచ్చి ఆదివాసిల భూములు కబ్జా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం,వడ్డీ వ్యాపారం చేస్తున్నారు,నోరులేని నిరక్షరాస్యులైన అమాయకపు ఆదివాసీల వేదన అరణ్య రోదనగా మారింది,మౌలిక వసతులు విద్య,వైద్యం లేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు,స్వయం పాలన కోసం జల్‌ జంగల్‌ జమీన్‌ల కోసం బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులపై నిజాం నవాబులపైన విప్లవ సాయుధ పోరాటం చేసి వీరమరణం పొందిన మర్సికోల రాంజీ గోండ్‌ నేటి ఆదివాసి యువతరానికి ఆదర్శం,ఆదివాసీ ఆత్మగౌరవ పోరాటాలను మరింత పదునెక్కింద్దాం,అదే రాంజీగోండ్‌ త్యాగానికి మనం ఆర్పించే ఘన నివాళి అవుతుందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో బండారి నారాయణ,తంబళ్ల రవి,వాసం పోలయ్య, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Previous "బార్యభర్తల మధ్య వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సిలింగ్"
Next కత్తితో అక్కను పొడిచి చంపిన తమ్ముడు
ADVERTISEMENT