Posted on 2025-04-05 10:59:52
సంబల్‌పూర్ నుంచి కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్న బాలిక
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన బాలికపై నిందితుడి అఘాయిత్యం
139 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి
రైలు సికింద్రాబాద్ చేరుకున్న వెంటనే నిందితుడి అరెస్ట్
డైలీ భారత్, సికింద్రాబాద్: కుటుంబంతో కలిసి సంబల్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఓ బాలికపై రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడి జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు ఆ ఘటనను వీడియో తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం ప్రకారం.. సంబల్‌పూర్‌కు చెందిన కుటుంబం రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరింది. వారు ప్రయాణిస్తున్న కోచ్‌లోనే బీహార్‌లోని మంద్వాడ్ జిల్లా ఖజోలి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ (21) ప్రయాణిస్తున్నాడు.
రైలు కేల్తార్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాలిక టాయిలెట్‌లోకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన సంతోష్ కుమార్ కూడా వెంటే వెళ్లాడు. బాలికను బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఫొటోలు కూడా తీశాడు. తెల్లవారిన తర్వాత బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తండ్రి వెంటనే 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న వెంటనే అప్పటికే కాపు కాసిన రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, ఘటన ఇటార్సీ రైల్వే స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >