డైలీ భారత్, పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్ నియామకం
అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన కొప్పురావూరి గిరీష్ కుమార్ ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కొప్పురావూరి గిరీష్ కుమార్ మాట్లాడుతూ ప్రతినిత్యం అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపితం చేస్తానన్నారు తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.