Posted on 2026-06-22 20:09:38
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య అందించాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బీజేపీ పార్టీ నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు అన్నిటిని పై స్థాయి విద్యాధికారులు తనిఖీ చేయాలని,ఈ రోజుల్లో విద్య అనేది అందరికీ చాలా ప్రామాణికమైనదని,పేద ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిద్దాం అనుకుంటే అక్కడ సరైన కనీస సదుపాయాలు లేవనే ఉద్దేశంతో,పేద విద్యార్థుల తల్లిదండ్రులు కాయకష్టం చేసి రూపాయి..రూపాయి కూడా పెట్టుకుని ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపించి వారు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారని,దీనిలో భాగంగా వారు వారి పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపడం జరుగుతుందని,ఇదే అదనుగా భావించి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వారు విద్యను వ్యాపారంగా చేసి పేద విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు వారి పాఠ్యపుస్తకాలను,యూనిఫామ్ లను వీటన్నిటిని కూడా వారు చెప్పిన దగ్గరే కొనుగోలు చేయాలని వారిని బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు,అలాగే ప్రైవేట్ పాఠశాలలో ఆ స్థాయికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి అలాగే వారు నడిపే స్కూల్ బస్సులకి కనీసం ఫిట్ నెస్ కూడా సరిగా ఉండడం లేదని,కొన్ని చోట్ల పిల్లలు త్రాగే నీరు,మరుగుదొడ్లు అసుబ్రంగా ఉంటున్నవి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్లను తనిఖీ చేసి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని,అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు.
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >
వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం
Posted On 2026-06-22 19:49:36
Readmore >