డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌ను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నూతన కమిటీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను చైర్‌పర్సన్ శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధికి జర్నలిస్టులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమాజ హితం కోసం శ్రమిస్తున్న జర్నలిస్టులకు మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. పట్టణ పరిధిలోని ప్రజా సమస్యలను వార్తల రూపంలో వెలుగులోకి తీసుకురావడం వల్లే తాము వెంటనే స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సైతం తన వంతు కృషి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా పట్టణ సమస్యలు, అభివృద్ధి అంశాలపై జర్నలిస్టులతో ఆమె ముచ్చటించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వి. రజనీకాంత్, జిల్లా కార్యదర్శి తోట రాజేష్, కోశాధికారి ముదాం వెంకటేష్, ఉపాధ్యక్షుడు అబిద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి రాము, ఈసీ మెంబర్ శ్రీకాంత్ తదితరులను చైర్ పర్సన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
News
మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు