| Daily భారత్
Logo




అమీన్పూర్,తెల్లాపూర్ బొల్లారం, తాజా మాజీ మున్సిపల్ పాలకవర్గాలకు ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

News

Posted on 2025-02-21 17:14:56

Share: Share


అమీన్పూర్,తెల్లాపూర్ బొల్లారం, తాజా మాజీ మున్సిపల్  పాలకవర్గాలకు ఘనంగా సన్మానం  చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

డైలీ భారత్, పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలకవర్గాలను ఆయన ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల కాలంలో నూతనంగా ఏర్పడిన అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుని అభివృద్ధికి ప్రత్యేకగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రతి పాలకవర్గ సభ్యుడు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్నారని అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే పంథాలో కొనసాగాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల పరిధిలో దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగేష్,మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, తొంట అంజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్లు లలిత సోమిరెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి,  మాజీ జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు దేవానందం, రవీందర్ రెడ్డి, యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సోమిరెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్,.పాండు, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >