| Daily భారత్
Logo




దళితుడి పై దాడి చేసిన అగ్రకుల పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి

News

Posted on 2025-02-20 13:50:41

Share: Share


దళితుడి పై దాడి చేసిన అగ్రకుల పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి

KVPS రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్

డైలీ భారత్, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్పల్లి గ్రామంలో ఎస్సి కులానికి చెందిన మామిడ్గి సుమన్  చింత చెట్టు ఎక్కి చింతకాయ తెంపిండని కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈరోజు సంగారెడ్డి లో జరిగిన కెవిపిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అతిమేల మానిక్ హాజరై మాట్లాడుతూ

ఫిబ్రవరి 13వ తేదీన పిప్పడ్పల్లి గ్రామానికి చెందిన చీకూర్తి నీలమ్మ భర్త అమృత్   మా వ్యవసాయ పొలం వద్ద ఉన్న చింత చెట్టుకు చింతకాయ తంపి తీసుకురావాలని చెప్పడంతో సుమన్ వెళ్లి చింత చెట్టు ఎక్కి చింతకాయలు తెంపుతుండగా చీకుర్తి లక్ష్మణ్ అతని భార్య మమత నీకు చింతకాయలు ఎవడు తెంపమన్నారని ఇష్టానుసారంగా దూషించినారు. తెంపిన చింతకాయలను అక్కడే వదిలేసి వెళ్ళిపోయినారు మరుసటి రోజు ఫిబ్రవరి 14వ తేదీన సుమన్ ఇంట్లో ఉన్నప్పుడు చీకూర్తీ లక్ష్మణ్ అతని భార్య మమతా వెళ్లి గల్లపట్టి ఇంటి నుండి గుంజుకొచ్చి కులం పేరుతో అనరాని మాటలు అంట్టు దూషించి దాడి చేయడానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కె(విపిఎస్) తీవ్రంగా ఖండిస్తుందని అని అన్నారు. పోలీస్ స్టేషన్లో పిటిషన్ వచ్చి ఆరు రోజులు గడిచిన ఇప్పటికి ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు చట్టం పెద్దదారులకు చుట్టంగా మారిందని అన్నారు. దళితుడు సుమన్ పై దాడి చేసిన అగ్రకుల పెత్తందారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి కేవీపీఎస్ రిమాండ్ చేస్తుందని అన్నారు... దీనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు 

ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ కెవిపిఎస్ నాయకులు రాజయ్య బాబురావు తదితరులు ఉన్నారు..

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >